[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » హ్యాట్స్ ఆఫ్ యూ గీతా సింగ్

హ్యాట్స్ ఆఫ్ యూ గీతా సింగ్

telugu-actress-geetha-singh
ఎవడిగోల వాడిది, కితకితలు లాంటి సినిమాలతో హస్యనటిగా మంచి గుర్తింపుతెచ్చుకుంది గీతాసింగ్. 2005లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె మేల్ డామినేషన్ ను తట్టుకుని, తనదైన నటనతో టాలీవుడ్ లో హాస్యనటిగా స్థిరపడిపోయింది. ఇటీవల ఆమె నటించిన చిత్రం కల్యాణవైభగమే. ప్రస్తుతం గీతా సింగ్ కామెడీ టైమింగ్ గతంలో లాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలేదు. అయితే, నటిగా మాత్రం ఆమె ఎప్పుడూ విఫలంకాలేదు. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. ఆమెలో ఎవ్వరికి తెలియని మరోకోణం కూడా ఉంది. అదే ఆమె సమాజానికి తన వంతుగా చేస్తున్న సేవ. దాని ద్వారా ఆమె ఎంతో మంది హృదయాలను గెలుచుకుంటున్నారు. గీతా సింగ్ బాలలకు నాణ్యమైన విద్య అందించడంలో కృషి చేస్తూ, ఎంతోమందికి ఆదర్శంగా నిలిస్తోంది. ఆమెకు నటుడు మోహన్ బాబు కూడా శాంతినికేతన్ విద్యాసంస్థల ద్వారా హెల్ప్ అవుతున్నారు. గీతాసింగ్ కృషి వల్ల చాలామంది చిన్నారులు శాంతినికేతన్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా చదువుకుంటున్నారు. సమాజానికి ఏదైనా చేయ్యాలన్న తపనే గీతాసింగ్ ను ఇలాంటి కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకునేలా చేసింది. హ్యాట్స్ ఆఫ్ యూ గీతా సింగ్.

Loading...
[X] Close
Share