[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » స్పోర్ట్స్ » కోర్టులో జుట్టు కత్తిరించుకున్న క్రీడాకారిణి !

కోర్టులో జుట్టు కత్తిరించుకున్న క్రీడాకారిణి !

tennis-star-svetlana-kuznetsova-cuts-her-hair-mid-match
ఆట ఆడే స‌మ‌యంలో ఆటగాళ్ళు వింత వింతగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. పలు సందర్భాల్లో చేతిలో ఉన్న‌వి నేల‌కేసి కొడుతూ.. మ‌రి కొన్ని సార్లు జెర్సీలు చింపుకుంటూ వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం చేస్తుంటారు. కాని ఇక్క‌డ జరిగింది వేరు.. మ్యాచ్ గెల‌వ‌డం కోసం ఏకంగా త‌న జుట్టునే క‌త్తిరించుకుంది స్వెత్లానా కుజ్నెత్సోవా(రష్యా). సింగపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ‘స్వెట్లానా కుజ్నేత్సోవా’ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ‘రద్వాంస్కా’ తో తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదటి సెట్‌ ను 7-5 తో సొంతం చేసుకున్న కుజ్నేత్సోవా.. రెండో సెట్‌ను 1-6 తో కోల్పోయింది. అయితే తన ఓటమికి కారణం తన జుట్టేనని భావించిన కుజ్నేత్సోవా విజేతను నిర్ణయించే 3 వ సెట్‌ కు ముందు కోర్టులోనే తన జడను కత్తిరించుకుంది. ఎంపైర్‌ ను అడిగి కత్తెర తెప్పించుకుని జట్టు చివర్లను కత్తిరించుకుంది. అయితే ఊహించని విధంగా 3వ సెట్ లో 7-5 తో గెలుపును సొంతం చేసుకుంది. తన జుట్టు తనకు చాలా ఒత్తిడిని కలిగించిందని.. హెడ్‌ బ్యాండ్‌ వెనుక పెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ జుట్టు ఒత్తుగా ఉండటంతో అది కుదరలేదని.. షాట్‌ కొడుతున్న ప్రతి సారీ తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నానని అందుకే అలా చేసుకున్నానని చెప్పింది.

Loading...
[X] Close
Share