[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » టాలీవుడ్ హీరోల ఎత్తు తెలిస్తే షాక్ అవుతారు ..?

టాలీవుడ్ హీరోల ఎత్తు తెలిస్తే షాక్ అవుతారు ..?

Tollywood Actors Heights

సినిమా హీరో కావాలంటే పొడవుగా ఉండడం అనేది అంత ఇంపార్టెంట్ కాదనే చెప్పాలి. ఆర్టిస్టులకు నటించడం వస్తే చాలు. అయితే ఒక్కసారి మన టాలీవుడ్ హీరోల్లో ఎవరి హైట్ ఎంత అనే విషయాన్ని తెలుసుకుందాం. మన టాలీవుడ్ హీరోల్లో అందరికన్నా ఎక్కువ హైట్ ఉండేది దగ్గుబాటి రానానే. రానా పొడవు 6 ఫీట్స్ 3 ఇంచెస్. రానా తరువాత మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ కూడా 6 ఫీట్స్ 3 ఇంచెస్ హైట్ ఉన్నాడు. అయితే ఈ హీరో రానా కంటే స్వల్ప మొత్తంలో హైట్ తక్కువే. వరుణ్ తరువాత అల్లరి నరేష్ 6 ఫీట్స్ 2.5 ఇంచెస్ తో మూడోస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 6 ఫీట్స్ 2 ఇంచెస్, మహేష్ బాబు, గోపీచంద్ 6 ఫీట్స్ 1 ఇంచ్, వెంకటేష్, నాగార్జున, జగపతిబాబు, శ్రీకాంత్ 6 ఫీట్స్ హైట్ ఉన్నారు. నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు హైట్ 5 ఫీట్స్ 10 ఇంచెస్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, మాస్ మహారాజ రవితేజ, అక్కినేని అఖిల్, నితిన్ కూడా 5 ఫీట్స్ 10 ఇంచెస్ హైట్ ఉన్నారు. మెగస్టార్ చిరంజీవి, నాగచైతన్య,సాయిధరమ్ తేజ ముగ్గురు ఈక్వల్ గా 5 ఫీట్స్ 8 ఇంచెస్ పొడవు ఉన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగాపవర్ స్టార్ రాంచరణ్, నేచురల్ స్టార్ నాని, ఎనర్జిటిక్ స్టార్ రామ్ సేమ్ హైట్ ఉన్నారు.ఈ నలుగురు హీరోల హైట్ 5 ఫీట్స్ 7 ఇంచెస్. ఇక బాబాయ్ అబ్బాయ్ లు యువరత్న బాలకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లది సేమ్ హైట్. ఇద్దరు 5 ఫీట్స్ 6 ఇంచెస్ పొడవున్నారు. ఇక ఈ జాబితాలో అందరికన్నా హైట్ తక్కువ ఉన్నది అక్కినేని నాగేశ్వరావుగారే. ఆయన హైట్ 5 ఫీట్స్ 5 ఇంచెస్.

Loading...
[X] Close
Share