[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » బాలీవుడ్ హీరోయిన్లకు షాకిచ్చిన బుల్లితెర బ్యూటీ

బాలీవుడ్ హీరోయిన్లకు షాకిచ్చిన బుల్లితెర బ్యూటీ

TV Actor Nia Sharma Beats Katrina, Alia And Sonam Becomes 3rd Sexiest Woman In Asia

నియా శర్మ .. హిందీ టీవీ సీరియళ్లు చూసే ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. ఏక్ అగ్ని పరీక్ష, జమై రాజా లాంటి టీవీ సీరియల్స్ తో 25 ఏళ్ల నియాశర్మ ప్రేక్షకులకు బాగా చేరువైంది.  తెరపై ఎంత అందంగా కనిపిస్తోందో.. అంతే హాట్ గా బికీనిలోనూ కనిపించి సెన్సేషన్ సృష్టించింది ఈ అమ్మడు. ఫంక్షన్లలో కూడా హాట్ హాట్ గా కనిపించడం ద్వారా నియాశర్మ ఎప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్ గా ఉండేది. బాలీవుడ్ భామలు.. సినిమాల్లో లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోతుంటే.. నియా మాత్రం బుల్లితెరపైనే అదరచుంబనాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ఏసియన్ సెక్సియెస్ట్ ఉమెన్ జాబితాలో కత్రినా కైఫ్, ఆలియా భట్, జక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి భామలను వెనక్కి నెట్టిన ఈ బుల్లితెర బ్యూటీ ఏకంగా 3 స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే జాబితాలో నియా 6 స్థానంలో ఉంది. ఇక గత నాలుగేళ్లపాటు ఏసియన్ సెక్సీయెస్ట్ ఉమెన్ గా తొలిస్థానంలో ఉంటూ వస్తోన్న ప్రియాంక చోప్రాకు ఈసారి దీపిక పదుకొనె చెక్ పెట్టింది. ప్రియాంక చోప్రాను వెనక్కినెట్టిన దీపికా తొలిసారి ఈ జాబితాలో నంబర్ వన్ పొజీషన్ ను దక్కించుకుంది. ఇక ఈ జిబితాలో టీవీ నటి ద్రష్టి ధామి నాలుగో స్థానంలో, సనయా ఇరానీ ఆరోస్థానంలో, కత్రినా కైఫ్‌ ఏడో స్థానంలో, సోనమ్‌ కపూర్‌ ఎనిమిదో స్థానంలో, పాకిస్థానీ నటి మహిరా ఖాన్‌ తొమ్మిదో స్థానంలోనూ, గహర్‌ఖాన్‌ పదో స్థానంలో నిలిచారు.బ్రిటన్ కు చెందిన ఈస్ట్రన్ ఐ వార్తాపత్రిక ఏటా ప్రపంచవ్యాప్తంగా  సెక్సీయెస్ట్ ఉమెన్ జాబితా కోసం ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తోంది. ఈ జాబితాలో కత్రినా కైఫ్ ఏటా టాప్ 5 లోనే ఉంటూ వస్తోంది. అలాంటిది తొలిసారి ఆమెకు నియా శర్మ లాంటి బుల్లితెర ఆర్టిస్టు రూపంలో షాక్ ఎదురైంది. నియా తన సెక్సీ అప్పీల్ తోనే ఈ జాబితాలో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.  అయితే ఇది తనకే కాదు చాలామందికి వింతగా అనిపించొచ్చు అని చెబుతోంది అమ్మడు. మొత్తానికి ఎప్పటికైనా బాలీవుడ్ లో అడుగుపెట్టడమే తన లక్ష్యమని చెప్పుకునే నియా శర్మకు ఈ జాబితాలో చోటు దక్కడం కలిసొచ్చే అంశమనే చెప్పాలి.

Loading...
[X] Close