[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » భోజనం అంటే వాళ్ళ తర్వాతే మరి : ఉపాసన

భోజనం అంటే వాళ్ళ తర్వాతే మరి : ఉపాసన

upasana-in-the-sets-of-khaidi-no-150ఇటీవల రాంచరణ్ వైఫ్ ఉపాసన కొణిదెల చాలా జోష్ గా కనిపిస్తోంది. తాజాగా ఖైదీ నెంబరు 150 సినిమా సెట్‌కు వెళ్లిన ఆమె అక్కడి విషయాలను ట్విట్టర్ లో  పంచుకుంది. అయితే ఆమె చెప్పింది సినిమా గురించి అనుకుంటే పొరపాటే. ఇటీవల లావు తగ్గిన ఉపాసన, అక్కడ వడ్డించిన భోజనం గురించి మాత్రమే చెప్పుకొచ్చింది. సెట్‌లోనే లంచ్ చేసిన ఆమె.. ఆ భోజనాన్ని పొగుడుతూ ట్విట్ చేసింది. ఆహా.. భోజనం. యమ్మీ! ఖైదీ నంబరు 150 సెట్‌లో వడ్డించిన భోజనం.. ఆహా ఏమి రుచిలే. స్పైసీగా, రుచికరంగా ఆస్వాదించే భోజనం. ఆహారం విషయానికొస్తే.. తెలుగు సినీ ఇండస్ట్రీ తర్వాతే ఏదైనా అంటూ ట్వీట్ చేసింది ఉపాసన. యమ్మీ..యమ్మీ ఫుడ్‌తో ఎవరికైనా నోరూరించే భోజనాన్ని పెట్టడం కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీకే చెల్లుతుంది. అందులే డౌటే లేదంటూ ఉపాసన తన ట్వీట్ లో తెలిపింది. ఇంతలా ఫుడ్ గురించి పొగడ్తలు కురిపించిన  ఉపాసన సినిమాపై మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కనీసం సెట్ లోని ఏవైనా ఫోటోలు పెడుతుందా చూద్దాం.. అని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. తన ట్విట్ కు ఎలాంటి ఫోటోలను ఉపాసన జత చేయలేదు.

Loading...
[X] Close