[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » వర్మ వంగవీటి ‘వార్’

వర్మ వంగవీటి ‘వార్’

Vangaveeti Radha Krishna And Kodali Nani Over RGV Vangaveeti Movie

రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వంగవీటి సినిమాపై వివాదం ఇంకా కొనసాగుతోంది.ఏ ఒక్కరు సినిమా విషయంలో పంతం వీడడంలేదు. సినిమా విషయంలో తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలకు కట్టుబడి ఉన్నామని, అందులో రాజీపడే ప్రసక్తి లేదని తాజాగా వైసీపి విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వస్తున్న వంగవీటి సినిమాలో తమను వక్రీకరించారని ఆరోపిస్తూ.. రాధాకృష్ణ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపధ్యంలో నెట్లో విడుదల చేసిన వంగవీటి మూవీ టీజర్లను తొలగించారు. అయితే సినిమాపై ఇంకా వివాదం ముగియలేదు. ఈ నేపథ్యంలో రామ్‌గోపా ల్‌వర్మ, చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్  విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.దాదాపు గంట పాటు జరిపిన ఈ సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పాల్గొన్నా రు. అయితే ఈ సమావేశం వివరాలు ఏవి బయటకు రాలేదు. వంగవీటి  సినిమాపై తమ అభ్యంతరాలపై రాజీ పడేది లేదని వంగవీటి రాధాకృష్ణ సమావేశం అనంతరం మీడియాతో చెప్పాడు.అటు వంగవీటి మోహన్‌రంగా కుటుంబసభ్యులతో తాము జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదని రామ్‌గోపాల్‌వర్మ తెలిపాడు. అయితే సినిమా విషయంలో కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు వర్మ. ఆ తరువాత రామ్‌గోపాల్‌వర్మ దేవినేని నెహ్రూ నివాసానికి బయలుదేరివెళ్లి, వంగవీటి సినిమా ట్రైలర్‌ను ఆయనకు చూపించారు. తాను ఎలాంటి వాడినో ప్రజలందరికి తెలుసని, సినిమాలో మరోలా చూపించినంత మాత్రాన ఎవ్వరూ నమ్మరని నెహ్రు తెలిపారు. ఇక సినిమాలో విషయంలో వర్మ కాస్త కూడా వెనక్కితగ్గడంలేదు. సినిమాలు తీసే హక్కు తనకు ఉందని, తన పని తాను చేశానని, ఎవ్వర్నీ టార్గెట్ చేసే ఉద్దేశం తనకు లేదని వర్మ స్పష్టం చేశారు.

Loading...
[X] Close