[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » న్యూస్ » ముంచుకొస్తున్న వార్ధా… భయంలో ప్రజలు

ముంచుకొస్తున్న వార్ధా… భయంలో ప్రజలు

vardha cyclone disaster hit chennai exclusive-wardha cyclone video-vardha cyclone video

వార్దా తుపాను రోజు రోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. శుక్రవారం వరకు తీవ్ర తుపానుగా కొనసాగిన వార్దా..  తాజాగా అతి తీవ్ర తుపానుగా మారింది.  గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర వైపు దూసుకువస్తోంది. శనివారం రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 710, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 650, చెన్నైకి తూర్పున 660 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అతి తీవ్ర తుపాను పశ్చిమ వాయవ్య దిశగా అదే తీవ్రతతో పయనించనుంది.అనంతరం క్రమేపీ బలహీనపడుతూ దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించి చెన్నై–ఒంగోలు మధ్య ఈనెల 12న మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం  వెల్లడించింది. దీని ప్రభావంతో ఆదివారం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురుస్తుందని తెలిపింది. సోమ, మంగళవారాల్లో దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు గాను, దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్రలోని జిల్లాలతో పాటు.. రాయలసీమలోని చిత్తూరు జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని వివరించింది. ఆదివారం రాత్రి నుంచి గంటకు 130 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.వచ్చే 48 గంటలపాటు మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోర్టుల్లో శనివారం రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.  కోస్తా, రాయలసీమ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీరాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించి తుపానును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.కోసిన పంటను సాధ్యమైనంత త్వరగా కుప్పలు వేసుకోవాలని, ఒకవేళ కోతకు వచ్చి ఉంటే ఒకట్రెండు రోజులు వాయిదా వేయాలని, నారు మడుల్లో పాయలు తీసి నీళ్లు పోయే మార్గం ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మరోవైపు వర్షాభావంతో అల్లాడుతున్న రైతులు ఈ తుపానుతోనైనా వర్షం పడుతుందన్న ఆశాభావంతో   ఉన్నారు.

Loading...
[X] Close
Share