[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » సినిమా » వేణుమాధవ్ రీఎంట్రీ…పవన్ కల్యాణ్ తొ మొదలెట్టాడు

వేణుమాధవ్ రీఎంట్రీ…పవన్ కల్యాణ్ తొ మొదలెట్టాడు

Venu Madhav Re-Entry with Pawan Kalyan Movie

వేణుమాధవ్.. తొలిప్రేమ మొదలు ఈ హాస్యనటుడికి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.  షార్ట్ టైమ్ లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు వేణుమాధవ్. పెద్ద సినిమాల్లో వేణుమాధవ్ ఖచ్చితంగా ఉండితీరాల్సిందే. అలా తీరకలేకుండా బిజీ కమెడియన్ అయిపోయాడు. అయితే చరణ్ నటించిన రచ్చ మూవీ తరువాత వేణుమాధవ్  కంటికి కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి వేణుమాధవ్ ఆరోగ్యంపై రకరకాలుగా రూమర్లు మొదలయ్యాయి. వేణుమాధవ్ చనిపోయాడంటూ వార్తలు వినిపించాయి. స్వయంగా వేణుమాధవ్ నేను బతికే వున్నాను అని బాధపడుతూ మీడియాతో చెప్పుకునే పరిస్ధితి వచ్చింది. తన హెల్త్ బాగానే ఉందని, వచ్చిన అవకాశాలు నచ్చకపోవడం వల్లనే సినిమాలు చేయలేదని చెప్పాడు. అయితే ఇదంత పక్కన పెడితే తాజాగా వేణుమాధవ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. అది కూడా పవన్ కల్యాణ్ మూవీలో. ఇంకా రెండు..మూడు క్రేజీ ప్రాజెక్టులు కూడా చేయబోతున్నాడట వేణుమాధవ్. అందులో త్రివిక్రమ్ మూవీ కూడా ఒకటి. మొత్తానికి వేణుమాధవ్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు ఇది శుభావార్తే. మరీ,ఈ స్టార్ కమెడియన్ గతంలో లాగా ప్రేక్షకులను అలరిస్తాడా లేదా చూడాలి.

Loading...
[X] Close