[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » స్పోర్ట్స్ » నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు : కోహ్లీ

నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు : కోహ్లీ

virat-kohli
నిన్న మొహాలీలో జ‌రిగిన మూడో వన్డే లో కోహ్లీ వీర‌ విహారం చేసిన విషయం తెలిసిందే. 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్ కు విజయాన్ని అందించాడు. అయితే కోహ్లీ మెరుపులకు, టీమిండియా గెలుపుకు న్యూజిలాండ్ క్రికెటర్ టేలర్ చేసిన ఒక్క తప్పిదమే కారణం. 13 పరుగులకే మొదటి వికెట్‌ కోల్పోయిన దశలో క్రీజు లోకి వచ్చిన కోహ్లీ కి 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్‌ లభించింది. హెన్రీ బౌలింగ్ లో విరాట్‌ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ ను టేలర్‌ వదిలేశాడు. ఈ క్యాచ్‌ పట్టి ఉంటే మ్యాచ్‌ ఫలితం వేరే విధంగా ఉండేది. అలా లైఫ్ పొందిన కోహ్లీ ఆ తర్వాత సెంచరీతో చెలరేగి న్యూజిలాండ్‌కు మ్యాచ్‌ విజయాన్ని దూరం చేశాడు. రాస్ టేలర్‌ ఎంత పెద్ద తప్పు చేశాడో కివీస్‌‌ కు తెలిసేలా చేశాడు. అయితే ఈ క్యాచ్ మిస్‌ వ్యవహారంపై మ్యాచ్ అనంతరం కోహ్లీ స్పందింస్తూ.. టేలర్ విషయంలో తనకు చాలా బాధ కలిగిందని.. ఎందుకంటే ఒక క్యాచ్ మిస్ చేసిన తర్వాత అదే ఆటగాడు భారీ స్కోర్ చేస్తే ఎంత బాధగా ఉంటుందో తనకు తెలుసునని కోహ్లీ వివరించాడు.

Loading...
[X] Close