[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » గుసగుసలు » పెళ్లెందుకు చేసుకోవాలో సుబ్బరాజుకు అర్థం కాలేదట

పెళ్లెందుకు చేసుకోవాలో సుబ్బరాజుకు అర్థం కాలేదట

Why did Actor Subbaraju NOT MARRY

సుబ్బరాజు.. తెలుగు తెరపై విలనిజానికి కేరాఫ్ అడ్రస్. అనూహ్యంగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన, పూరి జగన్నాధ్ చేతిలో పడి బిజీ ఆర్టిస్టు అయ్యాడు. కృష్ణవంశీ  తీసిన ఖడ్గం సుబ్బరాజు తొలిచిత్రం. ఆ తరువాత పవన్‌కల్యాణ్‌, మహేష్‌, ప్రభాస్‌ వంటి తెలుగు టాప్‌ హీరోలతోబాటు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వరకు అందరితోనూ  నటించి మెప్పించాడు. అయితే 39 ఏళ్ల వయసు వచ్చినా సుబ్బరాజు ఇంకా పెళ్లి చేసుకోలేదు. దానికి రీజన్ ఏంటో.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ముందుగా  పెళ్లెందుకు చేసుకోవాలో తనకు అర్థం కాలేదట. అయితే తనకు తెలిసిన చాలా మంది పెళ్లి జరిగింది అంటుంటారట. నిజానికి పెళ్లి జరగకూడదు.. చేసుకోవాలి. పెళ్లి అనేది సాధారణ  విషయం కాదు కదా.. ఏదో క్యాజువల్‌గా జరిగిపోవడానికి అన్నారు సుబ్బరాజు. ఆయన ఇది వరకు రిలేషన్‌లో ఉన్నా..  అది మధ్యలోనే ఆగిపోయిందట. అప్పటి నుంచి  సుబ్బరాజు ఒంటరిగా ఉంటున్నాడు. అయితే అలా ఉండడం వల్ల బోర్‌ ఫీల్‌ అయి పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెబుతున్నాడు. ప్రస్తుతం సుబ్బరాజు బాహుబలి  కంక్లూజన్ లో నటిస్తున్నాడు.

Loading...
[X] Close
Share