[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » ప్రత్యేకం » టాలీవుడ్ హీరోలు ‘రెడ్డి’ అమ్మాయిల్నే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా ?

టాలీవుడ్ హీరోలు ‘రెడ్డి’ అమ్మాయిల్నే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా ?

why-tollywood-heros-are-marrying-reddy-community-girls
రాంచరణ్, ఉపాసన రెడ్డి..అల్లు అర్జున్, స్నేహారెడ్డి.. మంచు విష్ణు, వెరోనికా రెడ్డి.. మంచు మనోజ్, ప్రణతి రెడ్డి..
అఖిల్,శ్రేయాభూపాల్ రెడ్డి.. ఏంటి వీళ్లంతా అనుకుంటున్నారా? ఈ జంటల పేర్లు గమనిస్తుంటే మీకు ఏం అనిపిస్తుంది. మన హీరోలంతా రెడ్డి సామాజిక వర్గం అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. ఈ హీరోలే కాదు ఇలా ఇంకా చాలామంది
టాలీవుడ్ హీరోలు రెడ్డి సమాజిక వర్గం అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. అసలు ఈ రెడ్డి సెంటిమెంట్ ఏంటి? రాజకీయాల్లో ఇలాంటి సెంటిమెంట్ ఉంటే.. ఏ పదవుల కోసమో అనుకోవచ్చు. కానీ, సినిమా తారల విషయంలో ఇలా ఎలా వర్కౌట్ అయ్యింది. అంటే దీనికి ప్రత్యేకమైన కారణాలేవిలేవు. రాం చరణ్ అపోలో గ్రూప్ కి చెందిన ఉపాసన రెడ్డి ని పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత అల్లుఅర్జున్ తన ఫ్యామిలీ రిలేషన్స్ అయిన స్నేహా రెడ్డి ని పెళ్ళి చేసుకున్నాడు. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు, వెరోనికా రెడ్డిని, మంచు మనోజ్, ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ రెండు జంటల్లో ఒకరికొకరు అంతకు ముందు పరిచయమున్నవారే. అంతేకాదు పెళ్లిళ్ల తరువాతే ఈ హీరోలకు కెరియర్ కూడా కలిసొచ్చింది. ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి అక్కినేని నట వారసుడు అఖిల్ కూడా చేరుతున్నాడు. జివికే కుటుంబానికి చెందిన శ్రియా భూపాల్ రెడ్డి ని అఖిల్ వివాహం చేసుకోబోతున్నాడు. వచ్చే నెల9న ఈ జంట నిశ్చితార్థవేడుక జరుగబోతుంది. ఆ తరువాత రోమ్ లో గ్రాండ్ గా పెళ్లి చేయడానికి శ్రేయా భూపాల్ కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. ఈ హీరోలందరు ఇలా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ఒకరకంగా సైలెంట్ మెసేజ్ లాంటిదే. అయితే ఈ హీరోలంతా అనుకోకుండా రెడ్డి కాంబినేష్ తో ముడిపడ్దారా? లేక ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి.

Loading...
[X] Close
Share