[X] Close
indion_news_banner_1 indion_news_banner_2 indion_news_banner_3
Home » న్యూస్ » ఆపదలో అమ్మాయిలు!

ఆపదలో అమ్మాయిలు!

women trafficking problems in hyderabad

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఉమెన్ ట్రాఫికింగ్‌ కేసులు భారీగా నమోదు అయ్యాయి. ఇటీవల నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో.. రిపోర్ట్‌ విడుదల చేసిన గణాంకాలు కలవరపెడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈశాన్య రాష్ట్రాలతో పోటీపడ్డ తెలంగాణ, ఏపీలు అదేస్థానంలో కంటిన్యూ అవుతున్నాయి. పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. అసోం, బెంగాల్‌ రాష్ట్రాల తర్వా తెలుగు రాష్ట్రాలు మూడోస్థానంలో నిలిచాయి. అసోంలో 1494 కేసులు నమోదు అయితే.. బెంగాల్లో 1255కేసులు నమోదు అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 835 ట్రాఫికింగ్‌ నేరాలు గుర్తించారు. తెలంగాణలో అత్యధికంగా 561 కేసులు నమోదు కాగా.. ఏపీలో 274 కేసులు రికార్డు చేశారు. తెలుగు రాష్ట్రాల తర్వాత నాలుగో స్థానంలో తమిళనాడు ఉంది.

తెలంగాణలో కేసులు పోలీసులకుసవాలుగా మారాయి.ఉమెన్ ట్రాఫికింగ్‌ ముఠాల నేరాలకు ఎక్కువగా బాలికలు బలవుతున్నారు . యువతులను, బాలికలను ఎత్తుకెళుతున్న ముఠాలు మెట్రో నగరాల్లో బలవంతంగా వ్యభిచార కూపాలకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌ నమోదు అయిన కేసుల్లో ఎక్కువగా వ్యభిచార ముఠాలకు సంబంధించిన కేసులే ఉంటున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను ఎత్తుకొచ్చి ఇక్కడ బాలికలతో వ్యాపారం చేస్తున్నారు. గోవా, ఢిల్లీ, బీవండి, పూనె వంటి ప్రాంతాల నుంచి ట్రాఫికింగ్‌ ముఠాల ద్వారా హైదరాబాద్‌ వచ్చిన బాలికలను గుర్తించి బంధువులకు అప్పగించిన కేసులు ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

Loading...
[X] Close
Share